Weather Report: కోస్తాకు భారీ వర్ష సూచన.. మరి తెలంగాణలో!!
తెలుగు రాష్ట్రాలతో వరుణుడు దోబూచులాడుతూ ఉన్నాడు. మేఘాలు మెండుగా ఉన్నా..
తెలుగు రాష్ట్రాలతో వరుణుడు దోబూచులాడుతూ ఉన్నాడు. మేఘాలు మెండుగా ఉన్నా.. వర్షం మాత్రం పెద్దగా పడడం లేదు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. జులై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.